Native Telugus from Srilanka
Discussion
3.0 hrs
July 11, 2025 6:00 pm Friday

Telugu Neravu Trust & Lamakaan invite you to an interaction with Native Telugus from Srilanka.

Title: An evening with our long lost cousins - Native Telugu people from Srilanka.

తెలంగాణ తెలుగు, ఆంధ్ర తెలుగు, సీమ తెలుగు అనేవి మనకు తెలుసు. శ్రీలంక తెలుగును ఎప్పుడైనా విన్నారా? శ్రీలంకలో తెలుగు ఏమిటని ఆశ్చర్య పోతున్నారా? అక్కడి అహికుంటకల అమ్మబాస తెలుగు. బ్రిటిష్ కాలంలో అంటే 150 ఏళ్ల క్రితమో, రాయల కాలంలో అంటే 500 ఏళ్ల క్రితమో, అశోకుడి కాలంలో అంటే రెండువేల ఏళ్ల కిందటో వీళ్లు ఇప్పటి తెలుగునేల నుంచి వలస వెళ్లారని అనుకొంటే పొరపాటే. ఈ శ్రీలంక అహికుంటకలు మాట్లాడే తెలుగులో మన మూడు ప్రాంతాల తెలుగుమాటలే కాకుండా, ఇప్పటి తమిళనాడు, ఇప్పటి కర్నాటక తావులలో వాడుతున్న తెలుగుమాటలు కూడా ఉన్నాయి. అలాగే మన తెలుగునేల మీద లేనటువంటి ఇంటిపేర్లు వీళ్లకి ఉన్నాయి. అందుకే వీళ్లని శ్రీలంక మూలవాసులుగా లెక్కించాలి. శ్రీలంక మానవశాస్త్రవేత్తల (Anthropologists) పరిశోధనలో కూడా అహికుంటకలు ఆ దేశ మూలవాసులుగా తేలింది. అహికుంటకలు తమది తెలుగుజాతి అనీ మనజాతి అనీ చెప్పుకొంటారు. సా.శకం తొలినాళ్లలోనే తెలుగువ్యాప్తి ఎంత వరకు ఉండిందో చెప్పడానికి అహికుంటకలు సజీవ సాక్ష్యం. ఈ శ్రీలంక జాతీయులు, తమ తెలుగు తోబుట్టువులను కలుసుకోవడానికి తొలిసారిగా భారతదేశానికి వస్తున్నారు. జూలై నెల 11వ తేదీ, శుక్రవారం సాయంత్రం 6 గంటలకు, హైదరాబాదు బంజారాహిల్స్ లోని లమకాన్ లో అహికుంటకల ప్రతినిధులైన తేబల మసెన్న గారితో, దుగిడి నిమల్ గారితో ఆత్మీయ సమావేశం జరుగుతుంది. అందరూ పాల్గొనవలసినదిగా కోరుకొంటున్నాం.

  • డి.పి. అనురాధ, తెలుగుజాతి ట్రస్టీ * స.వెం.రమేశ్, తెలుగు నెరవు మేనేజింగ్ ట్రస్టీ * అడపాల సుబ్బారెడ్డి, తెలుగు నెరవు ట్రస్టీ

All are Welcome!

Organizer
Telugu Neravu Trust & Lamakaan
Telugu Neravu Trust & Lamakaan